అక్షర సముహం అమరావతి:పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెచ్చిన యాప్ టీడీపీ తయారు చేసిందేనని అనుమానాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది అప్రజాస్వామికమని, ఆ యాప్‌ను తాము నమ్మడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖనే గతంలో నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు యాప్ అదే మాదిరిగా ఉందన్నారు. ‘టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్ తెచ్చారని భావిస్తున్నాం. పక్షపాతంతో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఆ యాప్.. టీడీపీ సృష్టే: అంబటి